Monday 23 November 2015

Circular No 8 and Draft Press Statement

Circular No 8 of CCGGOO and the draft press statement is sent by mail for your information and for further circulation amongst the members.

Please give wide publicity to this press statement.Please take initiative to publish the press statement in all the newspapers in your place.
 
Those who have not received the circular may please contact ccggoo2002@gmail.com for circular and draft press statement.

Yours Sincerely,
S.Mohan

1 comment:

  1. ఏడవ వేతన సంఘం - జీతాల పెరుగుదలకు వ్యతిరేకం
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచటాన్ని ఏడవ వేతన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. స్వాతంత్య్రానంతరం నియమింపబడిన ఏ వేతన సంఘం కూడా ఈ విషయంలో ఇంతగా లోభితనం ప్రదర్శించలేదు. ఆరవ, ఏడవ వేతన సంఘాలను స్థూలంగా పోల్చి చూసినప్పుడు వేతనాల పెరుగుదలపట్ల ఏడవ వేతన సంఘానికి వ్యతిరేకత ఎంత తీవ్రంగా వున్నదో తెలుస్తుంది.
    ఎక్కువ వేతనాలుగల ఉద్యోగులపై కంటే తక్కువ వేతనాలుగల ఉద్యోగులపట్ల ఏడవ వేతన సంఘం కఠినంగా వ్యవహరించింది. గరిష్ట వేతనానికి కనిష్ట వేతనానికి మధ్యగల నిష్పత్తి పెరుగుదలకు సంబంధించిన సిఫారసులో ఇది స్పష్టంగా కనపడుతున్నది. గతంలోగల 80000 రూపాయల గరిష్ట వేతనాన్ని 2.25 లక్షలకు పెంచారు(క్యాబినెట్‌ కార్యదర్శికి ప్రతిపాదించిన 2.50 లక్షల వేతనాన్ని విస్మరిద్దాం). గతంలో 6600రూపాయలున్న కనిష్ట వేతనాన్ని 18000 రూపాయలకు పెంచారు. గరిష్టానికి, కనిష్టానికి మధ్యగల నిష్పత్తి ప్రస్తుతం 13.8 రెట్లకు పెంచారు.
    వేతన సంఘం నివేదికకు ముందు అన్ని రకాల భత్యాలతో కలిపి ఒక వ్యక్తికి కనీస వేతనం 15750 రూపాయలు వస్తుంటే అదే వ్యక్తికి నూతన పే కమిషన్‌ ప్రకారం 18000 రూపాయలు వస్తుంది. ఇది అతని వేతనంలో 14 శాతం పెరుగుదల. కాబట్టి మొత్తం వేతనాలు కం కరువు భత్యాలు దాదాపు 24 శాతం పెరుగుతాయి. దీనితో పోల్చినప్పుడు కనీస వేతనం లభించేవారి జీతభత్యాలలో 14 శాతంగావున్న పెరుగుదల చాలా స్వల్ప పరిమాణంలో వున్నది.
    ఆర్థిక ఉదారీకరణ ప్రభావాలు
    ప్రయివేటు, ప్రభుత్వ రంగాలలో ఎగ్జిక్యూటివ్‌ల స్థాయిలోగల వేతనాలలో తేడా వుండటంవల్ల ప్రభుత్వాధికారులు 'అవినీతి'కి పాల్పడటానికి (తమ వేతనంలోని తేడాను సరిచేయటానికి) దారితీయటమో లేక వారు నిరపేక్షంగా అధికారం చెలాయించటానికి (అలాచేసి అధికారాన్ని చెలాయించటం ఒక 'సౌకర్యం'గా మార్చుకోవటానికి) దారితీయటమో లేక సామర్థ్యం ప్రభుత్వ రంగం నుంచి ప్రయివేటు రంగానికి వలస వెళ్లటానికి దారితీయటమో జరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ వంటి ప్రధాన రంగాలలో కొంతకాలంగా అలాంటి వలస ఇప్పటికే జరుగుతోంది. ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌వంటి సంస్థలు అందజేస్తున్న వేతనాలు కూడా ప్రయివేటు వైద్య రంగం ఇవ్వజూపుతున్న వేతనాలతో పోల్చినప్పుడు నామమాత్రంగానే వుంటున్నాయి. ఇలాంటి పరిస్థితివల్ల ప్రభుత్వ రంగం నుంచి ప్రయివేటు రంగానికి పెద్ద ఎత్తున వలస వెళ్లటానికి దారితీయనప్పటికీ ఇది ఎంతోకొంత సామర్థ్యం బయటకు వెళ్ళేలా చేసింది. ప్రతిష్టాత్మక సంస్థలనుంచి కూడా అలాంటి వలసలుంటే దేశంలోని మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణా సంస్థల పరిస్థితి ఏమిటో ఊహించుకోగలం. సమర్థ ఉద్యోగులు లేరని ప్రజలు భావిస్తే ఆరోగ్య సంరక్షణ ఇవ్వగలిగే ప్రభావాన్ని ఈ సంస్థలు చూపజాలవు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించవలసి వచ్చినప్పటికీ రోగులు ప్రయివేటు వైద్య సౌకర్యాలకోసం ఎగబడతారు. ఆవిధంగా ప్రజల్ని పీడించే ప్రయివేటు వైద్య రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుంది.
    ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఉన్నత స్థాయి ఉద్యోగులు వలస వెళ్ళకుండా ఆపటానికి ప్రభుత్వం కొంతవరకు వారి జీతభత్యాలను పెంచే అవకాశం వుంటుంది. నిజానికి అలా ప్రయివేటు రంగానికి వలస వెళ్ళటానికి అవకాశమున్న ఉద్యోగులను ప్రభుత్వ రంగంలోనే ఉండేలాచేయటానికి కావలసిన సిఫారసులు చేయాలనేది ఏడవ వేతన సంఘ ఉల్లేఖనా షరతులలో(టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) ఒకటి. అయితే వేతనాలు చెల్లించటంలో ప్రభుత్వ రంగం ప్రయివేటు రంగంతో పోటీపడలేకపోయినప్పటికీ ఎక్కువ వేతనాలతో ప్రయివేటు రంగం ఆకర్షించే ఉద్యోగులను వలస వెళ్ళకుండా చేయటానికి చేసే ప్రయత్నంలో భాగంగా తన వేతన నిర్మాణాన్ని మరింత అసమంగా వుండేలా చేస్తుంది.
    ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులను వలస వెళ్ళకుండా ఆపే ప్రయత్నం చేయటమంటే ప్రభుత్వ వనరులను ఎక్కువగా ఉపయోగించటమే. అయితే నయా ఉదారవాదంలో ఎఫ్‌ఆర్‌బిఎమ్‌ విధానంతోను, కార్పొరేట్‌-ఫైనాన్షియల్‌ బూర్జువాలకు దోచి పెట్టటంద్వారాను ప్రభుత్వ వనరులు ఎటూ కుచించుకుపోతాయి.
    ప్రభుత్వ రంగంలో బాగా వేతనాలున్న ఉద్యోగులు ప్రయివేటు రంగంలోకి వలస వెళ్ళకుండా ప్రభుత్వం వేతనాలు పెంచాలనిగాని, లేక ఏడవ వేతన సంఘం సిఫారసు చేసినదానికి ప్రత్యామ్నాయం లేదని నేను చెప్పటంలేదు. విషయం ఏమంటే నయా ఉదారవాద తర్కం దానిని 'మితవ్యయం', అసమానత దిశలోకి నెడుతుంది. ఈ తర్కాన్ని మనం ప్రతిఘటించాలి. ప్రజాస్వామ్య సంప్రదాయానికి సరిపడని అనుచిత స్థితికి చేరిన ప్రయివేటు రంగ వేతనాలను అదుపుచేయటం ఈ ప్రతిఘటనలో భాగమే. అయితే అలాంటి వేతనాలు ఆర్థిక మిగులు నుంచి వస్తాయి. ఈ మిగులును పెట్టుబడిదారులు ఉన్నత స్థాయి ఉద్యోగులతో పంచుకుంటారు. ఈ వేతనాలను అదుపుచేయటం ఆవశ్యకంగా అధిక పన్నులను విధించటంద్వారా ఈ మిగులు పరిమాణాన్ని నియంత్రించటం తో మొదలవుతుంది.

    ReplyDelete